News March 23, 2024
హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
Similar News
News February 6, 2026
KCRపై రేవంత్ విషం చిమ్ముతున్నాడు: KTR

TG: వైఫల్యాన్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి KCR వ్యక్తిత్వంపై CM రేవంత్ విషం చిమ్ముతున్నారని KTR అన్నారు. ‘ఇది తెలంగాణ పోరాట చరిత్ర మీద జరుగుతున్న దాడి. రేవంత్ తిట్ల ట్రాప్‌లో పడకండి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. కానీ రేవంత్ తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నాడు. ప్రభుత్వాన్ని నిలదీయండి. ప్రజల తీర్పే KCRకు ఇచ్చే అసలైన గౌరవం’ అని Xలో పోస్ట్ చేశారు.
News February 6, 2026
దోష నివారణకు దివ్య మార్గం ‘సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం’

జాతకంలో కుజ, సర్ప, రాహు-కేతు దోషాలతో బాధ పడుతున్నారా? వివాహంలో ఆటంకాలా? అయితే మీకు సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం అత్యుత్తమ మార్గం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ కల్యాణం, హోమంతో కుటుంబంలో శాంతి, వివాహ సౌఖ్యం, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. ఈ పూజ పూర్తి వీడియో రికార్డింగ్‌ను 24 గంటల్లో వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో జరిపించే ఈ పూజను వేద్మందిర్లో ఇప్పుడే <
News February 6, 2026
హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్

యాక్టర్, TVK అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టేసింది. 2015-16లో రూ.15కోట్ల ఆదాయానికి సంబంధించి పన్ను చెల్లించని కారణంగా రూ.1.50కోట్లు ఫైన్ కట్టాలని ఐటీ శాఖ నోటీసులిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన CJ ధర్మాసనం జనవరి 23న తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా ఆ ఫైన్ కట్టాల్సిందేనని తీర్పునిచ్చారు.


