News August 26, 2024

ఇసుక బుకింగ్‌కు స్పెషల్ వెబ్‌సైట్

image

AP: ఉచిత ఇసుక పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకురానుంది. ఇసుక పాలసీకి ఆమోదం తర్వాత SEP 11న ఈ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇందులో బుకింగ్, ఇసుక లభ్యత, పెండింగ్, డిస్పాచ్ వంటి వివరాలు ఉంటాయి. ఇప్పటికే పాలసీ మార్గదర్శకాలను అధికారులు రూపొందించారు. ఈ నెల 28న జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలపనుంది.

Similar News

News November 7, 2025

264 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. ఏపీఎస్పీలో 19 SI, 245 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27లో 10 SI, 125 కానిస్టేబుల్, 2027-28లో 9 SI, 120 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసు నియామక మండలికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

News November 7, 2025

ఏటా 5-10% పెరగనున్న ఇళ్ల ధరలు

image

ప్రస్తుతం దేశంలో ఏటా ఇళ్ల అమ్మకాలు 3-4L యూనిట్లుగా ఉండగా 2047 నాటికి రెట్టింపవుతాయని CII, కొలియర్స్ ఇండియా అంచనా వేశాయి. భారీ డిమాండ్ వల్ల 2 దశాబ్దాలపాటు ఏటా 5-10% మేర గృహాల రేట్లు పెరుగుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ $0.3 ట్రిలియన్లుగా ఉండగా 2047కు $5-10 ట్రిలియన్లకు పెరగొచ్చని తెలిపాయి. మౌలిక వసతులు, రవాణా, వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డాయి.

News November 7, 2025

NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

image

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCO<<>>)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in/