News August 9, 2024
స్పెషల్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కల్మషం లేని నవ్వు వారి సొంతం.. ఎవరికీ హాని తలపెట్టకూడదన్న స్వభావం వారి నైజం. పచ్చని చెట్లను ప్రేమిస్తూ.. వన్య ప్రాణులను లాలిస్తూ.. అడవితల్లి ఒడిలో సేదదీరుతారు. మౌలిక సదుపాయాలు లేకున్నా ప్రకృతి ప్రసాదించే వనరులు వినియోగించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పెరుగుతున్న ప్రపంచీకరణతో వారి సంస్కృతి దెబ్బతింటోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 9న UNO ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
Similar News
News February 1, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

TG: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపునకు రూ.720 కోట్లు విడుదల చేసింది. అలాగే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ బిల్లులు పడనున్నాయి. మరోవైపు గ్రాట్యుటీ GPF సరెండర్ లీవ్ అడ్వాన్సులను విడుదల చేసింది.
News February 1, 2026
2026-27 బడ్జెట్ స్పీచ్

*సెమీ కండక్టర్ 2.0 మిషన్ ప్రకటన.. సప్లై, రీసెర్చ్&ట్రైనింగ్‌పై ఫోకస్ కోసం రూ.40వేల కోట్లు కేటాయింపు
*బయో ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ కోసం రూ.10,000 కోట్లు
*దేశంలో కొత్తగా 3 NIPERలు
*ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడుకు రేర్ ఎర్త్ ప్యాకేజీ
*ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కేటాయింపులు రూ.40వేల కోట్లకు పెంపు
News February 1, 2026
పద్దు డిసైడ్ చేసేది వీళ్లే

కేంద్ర బడ్జెట్ వెనుక ఓ పెద్ద టీమ్ వర్కే ఉంటుంది. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధా ఠాకూర్, రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాస్తవ, ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ వి.వుయల్నామ్, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సెక్రటరీ ఆరునిష్ ఛావ్లా, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ కే మోసస్, ముఖ్య ఆర్థిక సలహాదారు వీ అనంత్ నాగేశ్వరన్ ఈసారి బడ్జెట్‌లో కీలక పాత్ర పోషించారు.


