News August 31, 2024
సీఎం మార్పుపై జోరందుకున్న ఊహాగానాలు

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముడా స్కాం, వాల్మీకి కోఆపరేషన్ స్కాం ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎంను మారుస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో డిప్యూటీ CM DK శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర వర్గాలు ఎవరికివారు తమ నేతకు పదవి దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నాయి. పరమేశ్వర్‌కు CM పదవి దక్కితే సంతోషిస్తానని మంత్రి రాజన్న చెప్పడం గమనార్హం.
Similar News
News November 21, 2025
నెల్లూరులో చేపల సాగుకు ప్రాధాన్యత

రొయ్యలకంటే చేపల సాగుకే నెల్లూరులో ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ ఖర్చులు, స్థిరమైన చరల కారణంగా చేపల పెంపకం ఏటా విస్తరిస్తోంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో గెండి, బొచ్చ, మోసు, రూప్‌చంద్ చేపలు ప్రధానంగా సాగు అవుతున్నాయి. సంవత్సరానికి సగటుగా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో గెండి 10%, బొచ్చ 35%, మోసు 3% ఉత్పత్తి. చేపలను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప.బెంగాల్‌కి ఎగుమతి చేస్తున్నారు.
News November 21, 2025
OTTలోకి వచ్చేసిన ‘బైసన్’

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News November 21, 2025
హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.


