News August 12, 2024
ఆస్ట్రేలియా పార్లమెంటు హౌస్లో బాలీవుడ్ తారల ప్రసంగం

బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్ ఆస్ట్రేలియా పార్లమెంటు హౌస్లో రేపు ప్రసంగించనున్నారు. ఈ నెల 15న జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకల్లో భాగంగా వారికి ఈ గౌరవం దక్కింది. వివిధ సంస్కృతుల మధ్య సినిమా వారధిగా ఎలా పనిచేస్తుందన్నదానిపై వారు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తమకు దక్కిన ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నామని వారిద్దరూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
Similar News
News November 5, 2025
నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.
News November 5, 2025
సినిమా అప్డేట్స్

* తాను నటిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఓ పాట పాడారు. దీన్ని ఈ నెల మూడో వారంలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం JAN 14న విడుదల కానుంది.
* సుధా కొంగర డైరెక్షన్లో శివకార్తికేయన్ నటిస్తోన్న ‘పరాశక్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజవనుంది.
* తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిరాధారమని, ఎలాంటి చిత్రాలనూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.
News November 5, 2025
APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<


