News March 9, 2025
ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి: మంత్రి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిర్మాణం పూర్తైన 2BHK ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Similar News
News September 15, 2025
తాండూరు వాసికి గోల్డ్ మెడల్

వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకురాలు పటేల్ జయశ్రీ రవిశంకర్ బంగారు పతకాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఓపెన్ పికిల్ బాల్ ఛాంపీయన్ షిప్లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. స్టేట్ లెవెల్లో సత్తా చాటిన విధంగా జాతీయ స్థాయిలో కూడా గొల్డ్ మెడల్ తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పటేల్ రవిశంకర్ సంతోషం వ్యక్తం చేశారు.
News September 15, 2025
సిరాజ్కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.
News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?