News June 27, 2024
రైల్వే పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి: ఎంపీ VSR

AP: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఎంపీ ట్వీట్ చేశారు. ‘ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరాను. వైజాగ్‌లో మెట్రో పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాను’ అని పేర్కొన్నారు.
Similar News
News April 11, 2026
కడుపులో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నావా చిచ్చరపిడుగా..!

15 ఏళ్ల వయసులో మనమేం చేసుంటాం. స్నేహితులతో సరదాగా ఆడుకొని ఉంటాం. కానీ వైభవ్ సూర్యవంశీ వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అసలు ఇంత చిన్న వయసులో అలాంటి విధ్వంసం ఎలా సాధ్యమని కోట్లాది మంది అవాక్కవుతున్నారు. ‘తల్లి కడుపులో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకొని ఉంటాడు’ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా నాలుగేళ్ల వయసు నుంచే వైభవ్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 14 ఏళ్లకే తొలి IPL మ్యాచ్ ఆడాడు.
News April 11, 2026
స్పేస్ మిషన్‌లో ఆ 6 నిమిషాలు టెన్షన్.. టెన్షన్!

స్పేస్ మిషన్లలో <<19621417>>రీఎంట్రీ<<>> సమయంలో వచ్చే 6 నిమిషాల ‘బ్లాక్ అవుట్’ ఒక సహజ ప్రక్రియే. వ్యోమనౌక వేగానికి గాలి ఒత్తిడికి లోనై 2,760°C వేడి పుడుతుంది. దీంతో క్యాప్సూల్ చుట్టూ ఏర్పడే ‘ప్లాస్మా’ పొర రేడియో తరంగాలను అడ్డుకోవడం వల్ల భూమితో కమ్యూనికేషన్ కట్ అవుతుంది. దీన్నే ‘మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అంటారు. వేగం తగ్గి ప్లాస్మా చల్లబడగానే సిగ్నల్ అందుతుంది. అప్పటిదాకా గ్రౌండ్ కంట్రోల్‌లో టెన్షన్ మామూలుగా ఉండదు.
News April 11, 2026
పడవ ప్రమాదం.. కఠిన నిబంధనలు తేవాలన్న సోనూసూద్

UP మథుర పడవ <<19620159>>ప్రమాదంలో<<>> 10 మంది ప్రాణాలు కోల్పోవడంపై నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతేడాది కూడా డజన్ల కొద్దీ ఇలాంటి ప్రమాదాల్లోనే చనిపోయారు. నివారించగలిగే ఇలాంటి ప్రమాదాల్లో అమాయకులు చనిపోవడం దురదృష్టకరం. ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తేవాలి. నిర్లక్ష్యం వీడితేనే ఇలాంటి ప్రాణనష్టాన్ని ఆపగలం’ అని X వేదికగా సూచించారు.


