News April 6, 2025
భూసేకరణ వేగవంతం చేయండి.. సీఎంకు కేంద్రమంత్రి లేఖ

తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని CM రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాశారు. ‘ప్రస్తుతం TGలో ₹12,619Crతో 691KM పొడవైన రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకు 1,550హెక్టార్ల భూమి అవసరం కాగా 904హెక్టార్లనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. మిగతా భూమిని త్వరగా సేకరిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయి. రవాణా వ్యవస్థ మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
టెన్త్ పరీక్షలు రాశారా.. నెక్స్ట్ ఏంటి?

టెన్త్ తర్వాత ఏం చేయాలో ఫిక్స్ అయ్యారా? సరైన గైడెన్స్ లేకపోవడంతో చాలా మంది ఎదుటివారిని చూసి ఆ కోర్సుల్లో జాయిన్ అవుతుంటారు. కానీ, టెన్త్ తర్వాత తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా పాలిటెక్నిక్, NTTIలో జాయిన్ అవ్వొచ్చు. ITI, IIIT, పారామెడికల్, ఇంజినీరింగ్, డిప్లొమా, గురుకులాలతో పాటు ఇంటర్లో MPC, BiPC, MEC, HEC కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు. SHARE IT
News April 8, 2025
IPL: ఓడిపోయినా మనసులు గెలుచుకున్నాడు

లక్నోతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో కేకేఆర్ పోరాడి ఓడింది. 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు బ్యాటర్లు ఆఖరి వరకు పోరాటం చేశారు. చివరి ఓవర్లో 24 రన్స్ చేయాల్సి ఉండగా రింకూ సింగ్ 14 రన్స్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్ మొదట్లోనే స్టైక్ వస్తే రింకూ కచ్చితంగా గెలిపించేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 8, 2025
ప్రియాంశ్ దూకుడు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ

IPL: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 6 ఓవర్లలో 75/3గా ఉంది. ప్రభ్సిమ్రాన్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4) ఔటయ్యారు.