News April 15, 2024
వాష్‌రూమ్‌లో ఎక్కువసేపు గడుపుతున్నారా?

ప్రస్తుతం బిజీ లైఫ్‌లో కొందరు వాష్‌రూమ్‌కు కూడా ఫోన్ తీసుకెళ్తుంటారు. ఫోన్ చూస్తూ చాలా సమయం అందులోనే గడిపేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చుంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి వెన్నునొప్పికి దారితీస్తుంది. తిమ్మిరి సమస్యలు ఎక్కువవుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్‌కు దారితీస్తుంది.
Similar News
News March 18, 2026
సన్‌రైజర్స్ వివాదం ముందే ఊహించాం: పీసీబీ వర్గాలు

The Hundred లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ కొనుగోలు చేయడంపై <<19368622>>తీవ్ర దుమారం<<>> రేగడం తెలిసిందే. అయితే దీన్ని ముందే ఊహించామని పీసీబీ వర్గాలు చెప్పాయి. ‘అబ్రార్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ తీసుకోవడంపై జరుగుతున్న రచ్చ మేం ఊహించనిదేమీ కాదు. అతడేమీ పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఇది ECB, ఫ్రాంచైజీకి సంబంధించిన విషయం’ అని తెలిపినట్లు టెలికం ఆసియా స్పోర్ట్స్ వెల్లడించింది.
News March 18, 2026
మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.
News March 18, 2026
రేణు దేశాయ్‌పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో <<19265289>>అసభ్యకర పోస్టులు<<>> పెట్టిన ఇద్దరు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అశ్లీల పదజాలంతో వేధిస్తున్నారని ఇటీవల 4 SM అకౌంట్లపై రేణు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని పోలీసులు పట్టుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. SMలో వేధించే కేటుగాళ్లను వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. బాధితులు తమను సంప్రదించాలని సూచించారు.


