News November 27, 2025
SPF నుంచి వేములవాడకు అదనపు సిబ్బంది

అభివృద్ధి పనులు జరుగుతున్న వేములవాడ క్షేత్రానికి అదనపు భద్రత కల్పించారు. ఇందుకోసం SPF విభాగం నుంచి అదనంగా 12 మంది సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం ఒక ASI, ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్ భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు ప్రారంభం కావడం, భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా మరో ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్‌ను పంపారు. నేటి నుంచి వీరు విధుల్లో చేరనున్నారు.
Similar News
News November 28, 2025
మూవీ ముచ్చట్లు

* Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్
News November 28, 2025
రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.
News November 28, 2025
ప్రకృతి వ్యవసాయం.. బాపట్ల కలెక్టర్ ప్రశంసలు

అమృతలూరు మండలం గోవాడకు చెందిన మహిళా రైతు దుర్గాదేవి ప్రకృతి వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. దీంతో శుక్రవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆమెను ప్రశంసించారు. కేవలం 1 ఎకరం భూమిలో సహజ వ్యవసాయం చేస్తూ A-గ్రేడ్, ATM, PMDS పద్ధతులను సమర్థంగా అమలు చేస్తూ పంటల వైవిధ్యాన్ని పెంచారన్నారు. 30 రకాల విత్తనాలతో నెలకు రూ.1,21,000ల ఆదాయం అర్జిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.


