News October 3, 2024

గూఢచారులు కావలెను: యూఎస్ ఓపెన్ ఆఫర్

image

చైనా, నార్త్ కొరియా, ఇరాన్‌లో తమకు గూఢచారులు కావాలని అమెరికా బహిరంగ ప్రకటన ఇచ్చింది. ఫేస్‌బుక్, X, యూట్యూబ్, ఇన్‌స్టా అన్నింట్లో CIA పోస్టులు పెట్టింది. తమను ఎలా రహస్యంగా సంప్రదించాలో కూడా తెలిపింది. వీపీఎన్ లేదా టోర్ నెట్‌వర్క్ ఆధారంగా తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఆయా దేశాల వీపీఎన్‌లు వాడొద్దని పేర్కొంది. కాగా చైనా, నార్త్ కొరియా, ఇరాన్‌ యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్‌లను నిషేధించాయి.

Similar News

News March 10, 2026

GREAT: కష్టకాలంలో భారతీయులకు అండగా..

image

యుద్ధం కారణంగా విమానాలు నిలిచిపోయి దుబాయ్‌లో ఇబ్బంది పడుతున్న భారతీయులకు అండగా నిలిచారు ఇండియన్ బిజినెస్‌మెన్ యోగేష్ దోషి. హోటల్ ఖర్చులను భరించలేని సుమారు 125 మంది ప్రయాణికుల కోసం తన 64 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌ భవనాన్ని కేటాయించారు. వారికి ఉచిత వసతితో పాటు ఆహారం, వైద్య సదుపాయాలను కూడా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈయనపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News March 10, 2026

NITTTRలో ఉద్యోగాలు.. ఈనెల 13 వరకు గడువు

image

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR)12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in

News March 10, 2026

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్లే

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం నెలకొంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆయన తండ్రి అలీ ఖమేనీ, తల్లి మన్సూరే ఖోజస్తే మరణించగా తర్వాతి దాడుల్లో భార్య (జహ్రా హదాద్ అడెల్), ఒక కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఒక సోదరి, బావ, ఇద్దరు పిల్లలు సహా మొజ్తబా మొత్తం 8 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు సమాచారం.