News May 26, 2024
స్పిన్ ఉచ్చు.. ఎవరికి చెక్ పెడుతుందో?

IPL ఫైనల్ మ్యాచ్ జరిగే చెన్నై చెపాక్ స్టేడియంలో స్పిన్నర్లదే ఆధిపత్యం. RRపై క్వాలిఫయర్-2లో SRH స్పిన్నర్లు షాబాజ్, అభిషేక్ అదరగొట్టారు. అయితే KKRలోనూ వరుణ్, నరైన్ వంటి టాప్ స్పిన్నర్లు ఉండటంతో.. చెపాక్‌లో స్పిన్ ఉచ్చులో ఏ జట్టు చిక్కుకుంటుందనేది ఆసక్తిగా మారింది. మంచు ప్రభావం లేకపోతే స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఇవాళ ఎవరి స్పిన్ తిరుగుతుందో? కప్ కొట్టేందుకు ఎవరికి అనుకూలిస్తుందో చూడాలి మరి.
Similar News
News January 28, 2026
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దీటైన జవాబు

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ వైపు మరో యుద్ధనౌక దూసుకొస్తోందని బెదిరిస్తూనే, వారు న్యూక్లియర్ డీల్ చేసుకుంటారని భావిస్తున్నానని ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు ఇరాన్ బదులిచ్చింది. తమపై యూఎస్ దాడులు చేస్తే మునుపెన్నడూ లేనంతగా దీటైన జవాబిస్తామని స్పష్టం చేసింది. అమెరికా తమతో చర్చలకు వస్తే అంగీకరిస్తామని, మిలిటరీ చర్యలకు దిగాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది.
News January 28, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అధికారులు నిరాకరిస్తే ఇళ్ల ఫొటోలు లబ్ధిదారులే యాప్‌లో పెట్టవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లంచం అడిగితే 1800 599 5991కు కాల్ చేయాలని సూచించారు.
News January 28, 2026
RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: RTCలో పనిచేస్తున్న 4వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ADC/కంట్రోలర్, లీడింగ్ హెడ్స్‌లకు పదోన్నతి లభిస్తుంది. నిర్ణీత టెస్ట్ పాసైన కండక్టర్లు Jr అసిస్టెంట్లు కానున్నారు. ‘గత OCTలోనే 7500 మందికి ప్రమోషన్‌పై GO వచ్చినా 550 మందికే ఇచ్చారు. దీనిపై లేఖ ఇవ్వగా సీనియార్టీపై క్లారిటీ ఇస్తూ MD ఆదేశాలిచ్చారు. వారంలోపే మిగతా వారికీ పదోన్నతి వస్తుంది’ అని EU నేతలు దామోదర్, నరసయ్య తెలిపారు.


