News April 7, 2025
యాక్షన్ థ్రిల్లర్‌గా ‘స్పిరిట్’!

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చే సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం మెక్సికోలో స్టార్ట్ చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. ‘స్పిరిట్ సినిమా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే ప్రాజెక్టు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఇది సాలిడ్ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ టైప్ సినిమా అని తెలియడంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.
Similar News
News April 9, 2025
వాహనదారులకు BIG ALERT

తెలంగాణలో ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) అమర్చాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు SEP 30, 2025ని డెడ్‌లైన్‌గా విధించింది. యజమానులు www.siam.in/లో అప్లై చేసుకోవాలని సూచించింది. టూ వీలర్స్ రూ.320-రూ.380, త్రీ వీలర్స్ రూ.350-రూ.450, ఫోర్ వీలర్స్‌కు రూ.590-రూ.700, కమర్షియల్ వాహనాలకు రూ.600-రూ.800 చెల్లించాలి.
News April 9, 2025
GT భారీ స్కోర్.. RR టార్గెట్ ఎంతంటే?

IPL: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217-6 స్కోర్ చేసింది. సాయి సుదర్శన్ (82) పరుగులతో రాణించగా, బట్లర్ (36), షారుఖ్ (36) ఫర్వాలేదనిపించారు. RR బౌలర్లలో తీక్షణ, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో రాజస్థాన్ గెలవాలంటే 20 ఓవర్లలో 218 రన్స్ చేయాలి.
News April 9, 2025
పిడుగులు పడి 13మంది మృతి

బిహార్‌లో పిడుగుపాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో 13మంది మృతిచెందారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మధుబనీ జిల్లాలో పొలంలో పనిచేస్తున్న వారిపై పిడుగుపడటంతో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మెుత్తంగా 4 జిల్లాల్లో పిడుగుల కారణంగా 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.