News February 3, 2025

ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?

image

TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్‌కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 3, 2025

కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు

image

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

News February 3, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

News February 3, 2025

షాకింగ్: క్రికెటర్ల కిట్స్‌ను బస్సులో ఉంచి తాళమేసిన డ్రైవర్!

image

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో దర్బార్ రాజ్‌షాహీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు, సిబ్బందికి డబ్బులు బకాయి పడింది. టీమ్ బస్ డ్రైవర్‌కైతే మొత్తం టోర్నమెంట్‌కు చెల్లించాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం స్పందించకపోవడంతో అతడు ఆటగాళ్ల క్రికెట్ కిట్‌లను బస్సులోనే ఉంచి తాళమేశాడు. డబ్బులిచ్చాకే తాళం తీస్తానని తేల్చిచెప్పాడు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.