News August 7, 2024

SPIRITUAL: చదువుల తల్లి కొలువైన బాసర

image

బాసరలో సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని స్వయంగా వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధంలో ప్రాణనష్టాన్ని చూసి మనోవ్యథతో గోదావరి తీరానికి వచ్చి తపస్సు చేసినట్లు గాథ. మూడు పిడికిళ్ల ఇసుకను మూడు చోట్ల కుప్పలుగా పోశారని.. అవే సరస్వతి, లక్ష్మి, కాళికా దేవి ప్రతిమలుగా మారాయని ప్రతీతి. నిర్మల్ జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసాలకు నెలవు.

Similar News

News January 15, 2025

చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్

image

TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.

News January 15, 2025

కేంద్ర మంత్రులతో శ్రీధర్‌బాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

TG: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని వైష్ణవ్‌ను కోరారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి ఫోర్ట్‌ల అభివృద్ధికి సహకరించాలని గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

News January 15, 2025

ఈ OTTలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్ట్రీమింగ్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. నవ్వులు పూయించే ఈ సినిమాను చూసేందుకు వృద్ధులు సైతం థియేటర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘ZEE5’దక్కించుకుంది. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా?