News August 4, 2024
SPIRITUAL: ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు

కన్నవారి సేవకు మించిన భగవత్సేవ ఉండదని చెబుతుంది సనాతన ధర్మం. తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణతో గణేశుడు మహాగణాధిపతి అయ్యాడు. పితృవాక్పరిపాలనతో శ్రీరాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. అంధులైన తల్లిదండ్రుల సేవతో శ్రవణ కుమారుడు.. కాశీ, గంగ కంటే తన కన్నవారి పాదసేవే పరమోత్కృష్టమని కుక్కుటముని చాటిచెప్పారు. అమ్మానాన్నలపై కరుణ లేని మనిషికి ఇహపరాల్లో సుఖం, భగవదనుగ్రహం దక్కదనేది పెద్దల మాట.
Similar News
News December 6, 2025
సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి

TG: ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సమ్మిట్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News December 6, 2025
వేంకన్న గుడికి పట్నాలో 10.11 ఎకరాలు

పట్నాలో తిరుమల వేంకన్న గుడి నిర్మాణానికి 10.11 ఎకరాలను బిహార్ ప్రభుత్వం కేటాయించింది. ₹1 టోకెన్ రెంటుతో 99 ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర CS ప్రతయ అమృత్ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడిందని నాయుడు తెలిపారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


