News February 12, 2025
నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739328875777_782-normal-WIFI.webp)
AP Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన 4రోజులపాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.
Similar News
News February 12, 2025
తగ్గిన బంగారం ధర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738011649886_1032-normal-WIFI.webp)
కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
News February 12, 2025
బర్డ్ ఫ్లూ అంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739326103736_782-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.
News February 12, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737158313401_1226-normal-WIFI.webp)
AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.