News October 21, 2024
వీకెండ్స్‌లో ఆధ్యాత్మిక యాత్ర.. 26 నుంచి ప్రారంభం: మంత్రి

AP: పర్యాటకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రముఖ ఆధ్మాత్మిక దేవాలయాలకు నెలవైన ఉమ్మడి తూ.గో జిల్లా యాత్రకు శ్రీకారం చుట్టింది. కోరుకోండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను సందర్శించుకోవచ్చని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. OCT 26 నుంచి ప్రతి శనివారం రాజమండ్రిలోని సరస్వతి ఘాట్ నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. రద్దీ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News January 18, 2026
ఇండియాకు mitc‘Hell’ చూపిస్తున్నాడు..

భారత బౌలర్లకు న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ చుక్కలు చూపిస్తున్నారు. గత మ్యాచులో సెంచరీతో చెలరేగిన ఈ ప్లేయర్ మూడో వన్డేలోనూ అర్ధశతకం బాదారు. 56 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్‌లో అతడికి ఇది మూడో 50+ స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా వన్డేల్లో భారత్‌పై 11 ఇన్నింగ్సుల్లో 600+ రన్స్ చేయగా ఆరు సార్లు 50+కి పైగా పరుగులు చేశారు. అద్భుతమైన ఫామ్‌తో ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నారు.
News January 18, 2026
ట్రంప్ మోసం చేశాడు: ఇరాన్ నిరసనకారులు

US అధ్యక్షుడు ట్రంప్ తమకు ద్రోహం చేశారని ఇరాన్ నిరసనకారులు మండిపడుతున్నారు. దాడికి సిద్ధంగా ఉన్నామని, సాయం త్వరలోనే అందుతుందని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను అణచివేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ‘దేశంలో 15 వేల మంది మరణానికి ట్రంప్ కారణం. మమ్మల్ని ఆయుధాలుగా వాడుకుని మోసం చేశారు. ఖమేనీ ప్రభుత్వంతో డీల్ చేసుకున్నారు’ అని ఆరోపిస్తున్నారు.
News January 18, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.


