News September 20, 2025
ఆశ్వయుజ మాసంలో వెల్లివిరియనున్న ఆధ్యాత్మికత

ఆశ్వయుజ మాసం పండుగలు, ఉత్సవాలతో ఆధ్యాత్మికతను నింపనుంది. సెప్టెంబర్ 22 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీశైలం క్షేత్రంలోనూ ఉత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 21న బతుకమ్మ సంబురాలు తెలంగాణలో ప్రారంభమై దుర్గాష్టమి వరకు కోలాహలంగా కొనసాగుతాయి. అదే సమయంలో సెప్టెంబర్ 24 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులను అలరిస్తాయి. ఈ ఉత్సవాల పరంపర దీపావళితో ముగుస్తుంది.
Similar News
News September 20, 2025
భారత్‌తో వన్డే.. ఆసీస్ అమ్మాయిల విధ్వంసం

భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ చెలరేగింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూనీ 75 బంతుల్లోనే 138 రన్స్‌తో విధ్వంసం సృష్టించారు. ఆమె ఏకంగా 23 ఫోర్లు బాదారు. జార్జియా 81, పెర్రీ 68, గార్డ్‌నర్ 39, హీలీ 30 రన్స్‌తో రాణించారు. ఉమెన్స్ వన్డేల్లో 400 స్కోర్ దాటడం ఇది ఏడోసారి కాగా ఆసీస్ రెండో సారి ఈ ఫీట్ సాధించింది. ఈ భారీ స్కోర్‌ను భారత్ ఛేదిస్తుందా? COMMENT
News September 20, 2025
రాష్ట్రంలో 9 పార్టీల తొలగింపు.. ఏవంటే?

TG: దేశవ్యాప్తంగా రెండో దశలో 474 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం <<17762955>>తొలగించిన<<>> విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. లోక్‌సత్తా, ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ, బీసీ భారత దేశం, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి, నవభారత్ నేషనల్, TG ప్రగతి సమితి, TG ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయన్నారు.
News September 20, 2025
మహిళా ఈ-హాత్ స్కీమ్ గురించి తెలుసా?

కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిలో 18 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవచ్చు.