News November 29, 2024

SPMVV: వివిధ పరీక్షల ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో M.A ఎకనామిక్స్ రెండవ సెమిస్టర్, LLM 4వ సెమిస్టర్, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ 7వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

Similar News

News December 14, 2024

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

image

శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్‌టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 14, 2024

నగరి: విద్యుత్ సిబ్బంది సాహసం.. బోటులో వెళ్లి మరమ్మతులు

image

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గూళూరు చెరువు పూర్తిగా నీటితో నిండింది. దీంతో వడమాల పేట మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సిబ్బంది నిండుకుండలా మారిన గూళూరు చెరువులోకి బోటులో వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. ప్రాణాలకు తెగించి వారు చూపిన తెగువను పలువురు అభినందించారు. 

News December 14, 2024

తిరుపతిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

image

తన ప్రేమ విషయం ఎక్కడా తండ్రికి తెలుస్తుందో అన్న భయంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రొంపిచెర్ల మండలానికి చెందిన ఓ అమ్మాయి తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. అక్కడే అన్నతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటోంది. ఆమె తోటి విద్యార్థిని ప్రేమించింది. ఈ విషయం ఆమె అన్నకు తెలియడంతో ఎక్కడ తండ్రికి చెబుతాడోమోనని భయపడి ఇంట్లోనే ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.