News March 11, 2025
SPMVV : వివిధ ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో M.A ఎకనామిక్స్ మొదటి, M.A మ్యూజిక్ మూడవ, M.A డ్యాన్స్ మూడవ, M.A తెలుగు మొదటి, మూడవ B.P.Ed 1, 3, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) మూడవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News March 25, 2025
రేపు భైంసాలో ఎస్పీ ఫిర్యాదుల విభాగం

పోలీసులు మీకోసంలో భాగంగా బుధవారం భైంసా క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఫిర్యాదుల విభాగం నిర్వహించనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భైంసా సబ్ డివిజన్లో ఉన్న ఫిర్యాదుదారులు నేరుగా ఆమెను కలిసి ఫిర్యాదులు అందజేయవచన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News March 25, 2025
టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.
News March 25, 2025
గద్వాల: ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం

పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి, నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. మంగళవారం గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను తెలుసుకున్నారు.