News February 5, 2025
SPMVV: స్టార్టప్లకు దరఖాస్తులు

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బిజినెస్ ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్ గ్రాంట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. నూతన ఆలోచనలో ఉన్న యువ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. రూ.10 లక్షల వరకు స్టార్టప్ గ్రాంట్ వస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.
Similar News
News November 27, 2025
నాగర్కర్నూల్: నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత: ఎస్పీ

నాగర్కర్నూల్ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 151 గ్రామాలకు గాను ఏర్పాటు చేసిన 48 నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపారు.
News November 27, 2025
ఎలక్టర్ల మ్యాపింగ్లో పురోగతి ఉండాలి: కర్నూల్ కలెక్టర్

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో మరింత పురోగతి తీసుకురావాలని కర్నూల్ జిల్లా కలెక్టర్ సిరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. గురువారం విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫార్ములను త్వరితగతిన క్లియర్ చేయాలని, బీఎల్ఓ, ఎపిక్ కార్డు పంపిణీ, మ్యాపింగ్, శిక్షణ విషయాలను వేగవంతంచేయాలని సూచించారు.
News November 27, 2025
శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.


