News February 5, 2025

SPMVV: స్టార్టప్‌లకు దరఖాస్తులు

image

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బిజినెస్ ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్ గ్రాంట్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. నూతన ఆలోచనలో ఉన్న యువ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. రూ.10 లక్షల వరకు స్టార్టప్ గ్రాంట్ వస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.

Similar News

News March 15, 2026

HYD – భద్రాచలానికి బస్సుల వేళలు ఇవే..!

image

హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ వివిధ బస్సు సర్వీసుల వేళలను క్రమబద్ధీకరించిందని డీఎం జంగయ్య తెలిపారు.
లహరి ఏసీ స్లీపర్.. ఉదయం 8:00, రాత్రి 10:00
రాజధాని ఏసీ.. ఉదయం 7:45; మధ్యాహ్నం 2:10, 3:45, రాత్రి 9:15
సూపర్ లగ్జరీ.. ఉదయం 4:30 నుంచి రాత్రి 11:20 వరకు (మొత్తం 18 సర్వీసులు నడుస్తాయన్నారు). పూర్తి వివరాలకు ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News March 15, 2026

ఎన్నికల వే‘ఢీ’.. సమ్మర్‌లో సమరమే!

image

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల <<19389988>>షెడ్యూల్‌తో<<>> వేసవిలో ఎలక్షన్ వే‘ఢీ’ మొదలైంది. అస్సాం మినహా మూడింట(TN, బెంగాల్, కేరళం) BJPయేతర ప్రభుత్వాలే ఉండటంతో సమరం రంజుగా సాగనుంది. ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP చూస్తుండగా మరోసారి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని స్టాలిన్, మమత, విజయన్ పోరాడుతున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్టీల ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ఈసమ్మర్ హాట్‌హాట్‌గా సాగనుంది.

News March 15, 2026

తాళ్లపాలెం నుంచి యూటర్న్ తీసుకున్న పెద్దపులి

image

ఆదివారం రాత్రి మరోసారి పెద్ద పులి యూటర్న్ తీసుకుంది. తాళ్లపాలెంలో మకాం వేసిన పులి రాత్రి మండపం నుంచి శంఖవరం వచ్చే రహదారిలో మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి సమీపంలో తిష్ఠ వేసిందని అధికారులు తెలిపారు. శంకవరం-మండపం రోడ్డులో బ్రిడ్జి సమీపంలో ఇది ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.