News September 6, 2025

SPMVV: పీజీ ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో ఎమ్మెస్సీ (M.Sc) స్టాటస్టిక్స్, ఎమ్మెస్సీ (M.Sc) సెరికల్చర్ రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Similar News

News September 6, 2025

సంగారెడ్డి జిల్లా పరిషత్‌లో మంత్రి సమీక్ష సమావేశం

image

మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సీఎస్ఆర్ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News September 6, 2025

గంగ ఒడికి బాలాపూర్‌ గణేశుడు

image

బాలాపూర్‌ గణేశుడు గంగ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, MJ మార్కెట్ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకొంది. సాయంత్రం 6:15 నిమిషాలకు క్రేన్‌ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సాగర్‌లో బాలాపూర్‌ గణేశుడిని నిమజ్జనం సంపూర్ణమైంది.

News September 6, 2025

జగిత్యాల: తల్లిని కొడుకు వద్దకు చేర్చిన అధికారులు

image

జగిత్యాల(R) మండలం ధరూర్ గ్రామానికి చెందిన ఆనెగండ్ల కిష్టమ్మ అనే వృద్ధురాలిని శనివారం జిల్లా అధికారులు ఆమె కొడుకు వద్దకు చేర్చారు. కిష్టమ్మను కొడుకు వేధించగా ఇంట్లో నుంచి వెళ్లిపోయి జగిత్యాలలో యాచిస్తూ రోడ్లపై తిరుగుతుండగా సమాజ సేవకులు జిల్లా సంక్షేమ అధికారికి సమాచారం అందించారు. దీంతో కిష్టమ్మ కొడుకు, కోడలు పిలిపించి జగిత్యాల ఆర్డీవో ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి చేర్చారు.