News January 4, 2026
SPMVV: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (CDOE) 2026 విద్యా సంవత్సరానికి UG/ PG/ PG డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన వారు https://www.spmvv.ac.in/dde/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 19.
Similar News
News January 6, 2026
బ్యాంకుల సహకారంతోనే సైబర్ నేరాల నియంత్రణ: ఎస్పీ

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఏటీఎం భద్రత, బ్యాంకు సెక్యూరిటీ, కస్టమర్లకు అవగాహన అంశాలపై ఎస్పీ శబరీశ్ బ్యాంకు మేనేజర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, క్యూఆర్ కోడ్ మోసాలు, ఆన్‌లైన్, ఇన్‌స్టంట్ లోన్స్ పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలపై బ్యాంకర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకుల సహకారంతోనే సైబర్ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు.
News January 6, 2026
మిక్స్డ్ టైప్ స్కిన్‌కు ఈ ఫేస్ ప్యాక్

కొన్నిసార్లు జిడ్డుగా, మరొకసారి పొడిబారినట్లుండే చర్మతత్వం కొందరిలో కనిపిస్తుంది. దీన్నే మిక్స్డ్ టైప్ స్కిన్ అంటారు. ఇలాంటి తత్వం ఉన్నప్పుడు చర్మం డల్‌గా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఒక గుడ్డు తెల్లసొనకు తేనె, చెంచా నారింజ రసం, పావుచెంచా పసుపు కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేస్తే చాలు. ముఖ చర్మమంతా ఒకేలా మెరుపులీనుతుంది. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయడం మంచిది.
News January 6, 2026
పండుగ హడావిడి అప్పుడే మొదలైంది!

సంక్రాంతికి వారం ముందే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఏపీలో అరిసెలు, జంతికల సువాసనలు వెదజల్లుతుండగా తెలంగాణలో మహిళలు సకినాల తయారీలో నిమగ్నమయ్యారు. ఒకపక్క గాలిపటాలు ఎగరేస్తూ పిల్లలు కేరింతలు కొడుతుంటే మరోపక్క పందెం రాయుళ్లు కోళ్లను రెడీ చేసుకుంటున్నారు. అటు నగరవాసులు సొంతూళ్లకు ఎలా వెళ్లాలా? అనే ప్రణాళికల్లో బిజీ అయ్యారు. పల్లెల్లో ముగ్గులు, హరిదాసుల కీర్తనలతో పండుగ కళ సంతరించుకుంది.


