News October 18, 2025
SPMVV: ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో (B.Voc) బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్స్ ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News October 18, 2025
యార్డుల్లో ఇసుక సరఫరా పెంచాలి: కలెక్టర్

జిల్లాలో డిమాండ్‌కు తగ్గట్టుగా యార్డుల్లో ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుండి ఇసుక రీచ్‌లలో త్రవ్వకాల పునరుద్ధరణ కార్యక్రమంపై సమీక్షించారు. స్టాక్ యార్డులలో ఉన్న ఇసుక వివరాలను గనుల శాఖ అధికారులు నిత్యం ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించారు.
News October 18, 2025
దీపావళి దీపాలు: పాటించాల్సిన నియమాలు

దీపావళి రోజున దీపాలను నేరుగా నేలపై పెట్టడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. నేలపై అక్షింతలు పోసి, వాటిపై పెట్టాలని సూచిస్తున్నారు. ‘దీపంలో నూనెను పూర్తిగా నింపకూడదు. అది బయటకి వస్తే లక్ష్మీదేవికి అపకీర్తి కలిగిస్తుంది. ఆరోగ్యం కోసం తూర్పున, ధనం కోసం ఉత్తరాన దీపాలు పెట్టాలి. నేతి దీపానికి పత్తి వత్తిని, నూనె దీపానికి ఎర్ర దారం వత్తిని వాడాలి. పగిలిన ప్రమిదలను వాడొద్దు’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
పాక్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే.. రాజ్‌నాథ్ వార్నింగ్

పాకిస్థాన్‌లోని ప్రతి ఇంచ్ తమ బ్రహ్మోస్ మిసైళ్ల రేంజ్‌లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హెచ్చరించారు. బ్రహ్మోస్ సత్తా ఏంటో ఆపరేషన్ సిందూర్‌లో తెలిసిందని అన్నారు. ‘Op Sindoor ట్రైలర్ మాత్రమే. ఆ ట్రైలర్‌తోనే మనమేంటో ప్రత్యర్థికి అర్థమైంది. పాక్‌కు జన్మనివ్వగలిగిన ఇండియా.. అవసరమైతే ఏమైనా చేయగలదని తెలియజేసింది’ అని చెప్పారు. UP లక్నోలో తయారైన తొలి విడత బ్రహ్మోస్ మిసైళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు.