News September 6, 2025

SPMVV: మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశం

image

నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హర్ నెస్సింగ్ ఇన్నోవేషన్స్ (NIDHI) పథకం ద్వారా పద్మావతి మహిళా యూనివర్సిటీ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులు చివరి తేదీ సెప్టెంబర్ 15.

Similar News

News September 6, 2025

VZM: ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ల ప‌రీక్ష కోసం కంట్రోల్ రూమ్‌

image

విజయనగరం జిల్లాలో ఏపీపీఎస్‌సీ ఆధ్వ‌ర్యంలో ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫారెస్టు బీట్ ఆఫీస‌ర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్ల ప‌రీక్ష కోసం అభ్య‌ర్థుల‌కు స‌హాయం అందించేందుకు క‌లెక్ట‌రేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామ‌ని జిల్ల రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి శనివారం తెలిపారు. అభ్య‌ర్థులు త‌మ సందేహాల నివృత్తికి ఈ కంట్రోల్ రూమ్ నంబరు 08922-236947కి సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని సూచించారు.

News September 6, 2025

వనపర్తి: 7న సంపూర్ణ చంద్రగ్రహణం

image

సెప్టెంబర్ 7వ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడుతుందని వనపర్తి జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంతాచార్యులు తెలిపారు. చరిత్రలో ఎప్పుడు లేనంతగా మూడు గంటల పాటు గ్రహణం ఏర్పడనుందని చెప్పారు. గ్రహణం ఆదివారం రాత్రి 9:55 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 గంటలకు ముగుస్తుందన్నారు.

News September 6, 2025

మహబూబాబాద్: కురవిలో విషాదం

image

కరెంట్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి అనే రైతు తన వ్యవసాయ మోటార్ రిపేర్ కోసం దగ్గరలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.