News February 5, 2025

SPMVV: స్టార్టప్‌లకు దరఖాస్తులు

image

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బిజినెస్ ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్ గ్రాంట్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. నూతన ఆలోచనలో ఉన్న యువ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. రూ.10 లక్షల వరకు స్టార్టప్ గ్రాంట్ వస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.

Similar News

News February 5, 2025

హైదరాబాద్‌లో ఎవరి బలం ఎంత?

image

HYDలో ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. GHMC స్టాండిండ్ కమిటీ సభ్యుల్లో ఏ పార్టీకి ఎంత మంది ఓటేస్తారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. INC 24, MIM 41, BJP 41, BRS 40 మంది ఉన్నారు. స్టాండింగ్ కమిటీ కోసం 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికవుతారో అనేది ఆసక్తిని రేపుతోంది.

News February 5, 2025

గంభీరావుపేట: అర్ధరాత్రి అదుపు తప్పిన కారు 

image

గంభీరావుపేట మండలంలోని మల్లుపల్లి గ్రామం బ్రిడ్జి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణం అని సమీపంలో ఉన్న వారు తెలిపారు. ఈ ఘనటపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

చారగొండలో 26 ఇళ్ల తొలగింపు

image

చారకొండ 167 జాతీయ రహదారి రోడ్డు విస్తరణ భాగంలో భాగంగా మండల కేంద్రంలో మొత్తం 30 ఇళ్లు తొలగించాల్సి ఉండగా అధికారులు ఇప్పటికీ 26 తొలగించారు. ఇల్లు కోల్పోయిన 26 మందికి నష్టపరిహారం అందజేసినట్లు తహశీల్దార్ సునీత తెలిపారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న మరో నాలుగు ఇళ్లు కూల్చివేయాల్సి ఉండగా సంబంధిత ఇంటి యజమానులు కూల్చివేతకు సుముఖంగా లేరని తెలిసింది.

error: Content is protected !!