News February 5, 2025
SPMVV: స్టార్టప్‌లకు దరఖాస్తులు
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బిజినెస్ ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్ గ్రాంట్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. నూతన ఆలోచనలో ఉన్న యువ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. రూ.10 లక్షల వరకు స్టార్టప్ గ్రాంట్ వస్తుందన్నారు. ఆసక్తి కలిగిన వారు వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.
Similar News
News February 5, 2025
రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్‌కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
News February 5, 2025
కొమురవెల్లి: గుండెపోటుతో టీచర్ మృతి
సిద్దిపేట జిల్లాలో గుండెపోటుతో టీచర్ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం మరి ముచ్చాల గ్రామానికి చెందిన అశోక్(50) టీచర్. ఇటీవలే కొమరవెల్లి ZPHS ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసిన ఆయన దుబ్బాక మండలం దుంపలపల్లి పాఠశాలకు పీఈటీగా బదిలీపై వెళ్లారు. కాగా ఈ ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయారు. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News February 5, 2025
బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పులి సంచారం
వారం రోజులుగా పెద్దపులి సంచారం 2 మండలాల అటవీ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధి బుగ్గగూడెం అటవీ ప్రాంతం, కాసిపేట దుబ్బగూడెం, పెద్దనపల్లి ఏరియాల్లో సంచరిస్తోంది. బుధవారం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారి పూర్ణచందర్ తెలిపారు.