News August 10, 2024

శక్తివంతమైన సాధనంగా క్రీడలు: యోగి

image

క్రీడలు ఇప్పుడు భవిష్యత్తును మార్చే శక్తివంతమైన సాధనంగా ఉన్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇవి దోహదపడుతాయని గోరఖ్‌నాథ్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్రంలో పోలీసు, ఇతర విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 22, 2025

వైట్‌హౌస్‌లోకి బుల్డోజర్లు.. కారణమిదే!

image

వరుస వివాదాలు చుట్టుముడుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా వైట్‌హౌస్‌లోని ఈస్ట్ వింగ్‌లో కొంతభాగాన్ని బుల్డోజర్లతో కూలగొట్టిస్తున్నారు. తన బాల్‌రూమ్ ప్రాజెక్టు ($250M) కోసం ఆయన ఇలా చేస్తున్నారు. కూల్చివేతల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అధికారిక విందులు, సమావేశాలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగించే పెద్ద గదినే బాల్‌రూమ్/బాల్‌హాల్ అంటారు.

News October 22, 2025

TATA RECORD: 30 రోజుల్లో లక్ష కార్ల డెలివరీ

image

ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ రికార్డు సృష్టించింది. నవరాత్రి నుంచి దీపావళి వరకు 30 రోజుల్లో లక్షకు పైగా కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే 33% వృద్ధి సాధించినట్లు వెల్లడించింది. అత్యధికంగా నెక్సాన్ 38వేలు, పంచ్ 32వేల యూనిట్లను విక్రయించామని తెలిపింది. అలాగే 10వేలకు పైగా EVలను అమ్మినట్లు పేర్కొంది. జీఎస్టీ 2.0, పండుగలు కలిసొచ్చినట్లు వివరించింది.

News October 22, 2025

డీఏ జీవోలో మార్పులు

image

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్‌లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.