News March 5, 2025
విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్

AP: విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.200 కోట్లతో నిర్మించే ఈ కేంద్రం దేశంలోనే రెండోది. దీని నిర్వహణ ఖర్చునూ కేంద్రమే భరించనుంది. దీంతో పాటు కృత్రిమ అవయవాలు తయారు చేసే అలిమ్‌కో కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. కొమ్మాదిలో 22 ఎకరాలను కేటాయించగా, 3 నెలల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Similar News
News March 4, 2026
TDP Vs YCP.. మండలిలో రసాభాస

AP: తిరుమల లడ్డూపై చర్చ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సంబంధం లేని అంశాలు చర్చకు తెచ్చి డైవర్ట్ చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై తమ MLC చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగాన్ని TDP అడ్డుకుందంటూ YCP ఆందోళనకు దిగింది. అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామంది. దీంతో వాకౌట్ చేసి వెళ్లిపోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
News March 4, 2026
ఇరాన్ అణుబాంబు ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు

యుద్ధం వేళ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని, తయారు చేస్తోందనడానికి ఆధారాలూ లేవన్నారు. కానీ ఆ దేశం దగ్గర యురేనియం నిల్వలు ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. ఇరాన్ అణుబాంబు ప్రయోగిస్తుందనే ప్రచారంపై స్పష్టత లేదన్నారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందని ఆరోపిస్తూ US, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి.
News March 4, 2026
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి పీజీ, పీజీ(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd, MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.amuonline.ac.in/


