News March 4, 2025
శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు

AP: శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.. మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. చీఫ్ విప్లు, విప్లకు పేర్లు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న సభలో ప్రకటించారు. ఈ నెల 18,19,20 తేదీల్లో నిర్వహించే పోటీలకు IASలు, హైకోర్టు జడ్జిలను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Similar News
News March 4, 2025
ప్చ్.. కోహ్లీ సెంచరీ మిస్

ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైనల్లో కచ్చితంగా సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కాస్త దూరంలో ఆగిపోయారు. 84 పరుగుల వద్ద భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43 ఓవర్లలో 226/5గా ఉంది. భారత్ విజయానికి 42 బంతుల్లో 39 రన్స్ అవసరం. క్రీజులో కేఎల్ రాహుల్ (31*), హార్దిక్ పాండ్య (1*) క్రీజులో ఉన్నారు.
News March 4, 2025
Japan Train: సెకన్ లేటుగా వచ్చినా ఊరుకోరు!

ఇండియాలో చాలా రైళ్లు రోజూ గంటల కొద్దీ ఆలస్యంగానే నడుస్తుంటాయి. అయితే జపాన్ రైల్వే దీనికి పూర్తి వ్యతిరేకం. అక్కడి రైళ్లు స్టేషన్కు చేరుకునే సమయంలో సెకండ్లను కూడా ఉంచుతారు. సమయపాలన కోసం టెక్నాలజీని వాడుతున్నారు. ఆటోమెటిక్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికత రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. షెడ్యూల్ ప్రకారం నడిచేలా సహాయపడుతుంది. ఓసారి 35 సెకండ్లు లేటుగా వచ్చినందుకు రైల్వే అధికారులు క్షమాపణలు కూడా చెప్పారట.
News March 4, 2025
శ్రీవారి ఆలయాలకు ఫ్రీగా స్థలం కేటాయించండి: TTD ఛైర్మన్

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని TTD ఛైర్మన్ BR నాయుడు కోరారు. CM చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు పలు రాష్ట్రాల CMలకు లేఖలు రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ముఖ్యమన్నారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు ఆలయాలది కీలక పాత్ర అని చెప్పారు.