News April 4, 2024
బాక్సర్ల విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ విదేశాల్లో శిక్షణ తీసుకోనున్నారు. ఆమెతో పాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా కూడా టర్కీలో ట్రైనింగ్ పొందనున్నారు. వీరి శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ తెలిపింది. అలాగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు గాను భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రాకు అయ్యే ఖర్చులను కూడా చెల్లిస్తామని పేర్కొంది.
Similar News
News November 9, 2024
రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పశ్చిమ దిశగా కదులుతూ ఇది తమిళనాడు/ శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో APలోని ప్రకాశం, NLR, TPTY, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం నుంచి 3 రోజులు భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. సముద్రం అలజడిగా ఉంటుందని, వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.
News November 9, 2024
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
TG: మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతిదేవి మరణించారు. అనారోగ్యంతో ఇటీవల బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. జ్యోతిదేవి మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు. 1998లో మెట్పల్లి ఉపఎన్నిక సందర్భంగా ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. సుమారు 17 నెలలపాటు ఎమ్మెల్యేగా సేవలందించారు.
News November 9, 2024
‘పది’ పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 లాస్ట్ డేట్
TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 18 తుది గడువు అని పరీక్షల విభాగం కన్వీనర్ ఎ.కృష్ణారావు తెలిపారు. రూ.50-రూ.500 వరకు ఆలస్య రుసుముతో DEC 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎగ్జామ్ ఫీజును రూ.125గా నిర్ణయించినట్లు చెప్పారు. SC, ST, BC విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేల లోపు ఉండి, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పిస్తే ఫీజు మినహాయింపు ఉంటుందని తెలిపారు.