News November 4, 2024

ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 3 శాతానికి పెంపు

image

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ GOVT నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. APని క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో పాలసీకి రూపకల్పన చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. అలాగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు.

Similar News

News November 16, 2025

పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

image

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.

News November 16, 2025

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.

News November 16, 2025

DIHARలో 21 పోస్టులు

image

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 21 JRF,రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంటెక్, బీటెక్, BE, MSc, M.VSc, PhD ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హత గలవారు డిసెంబర్ 5న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37వేలు+HRA, RAకు రూ.67వేలు+HRA చెల్లిస్తారు.