News July 16, 2024
పురుగు మందులు పిచికారీ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

* ద్రావణాలను కలిపే సమయంలో మందు డబ్బాపై ఉన్న సూచనలు పాటించాలి.
* శుభ్రమైన నీటిని వినియోగించాలి
* చేతులకు గ్లౌజులు, తలకు టోపీ, ముఖానికి మాస్క్, కళ్లజోడు పెట్టుకోవాలి
* పిచికారీ చేస్తుండగా గుట్కా నమలడం, సిగరెట్ తాగడం లాంటివి చేయొద్దు
* పిచికారీ పూర్తయ్యాక చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి
* పొలం నుంచి ఇంటికెళ్లాక తలస్నానం చేయాలి
Similar News
News January 10, 2026
జమ్మూ: సాంబా సెక్టార్లోకి పాకిస్థాన్ డ్రోన్

జమ్మూ కశ్మీర్లోని సాంబా సెక్టార్లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించడం కలకలం రేపింది. BSF బలగాలు డ్రోన్ కదలికలను గుర్తించాయి. డ్రోన్ ద్వారా పాక్ ఆయుధాలు జార విడిచినట్లు తెలుస్తోంది. ఫ్లోరా గ్రామం వద్ద భద్రతా బలగాలు ఆయుధాలను గుర్తించాయి. 2 పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నాయి.
News January 10, 2026
బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

హైబీపీకి ఎన్నో కారణాలుంటాయి. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పొట్టుతో ఉన్న గింజధాన్యాలతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలి. రైస్బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని నాలుగైదు చెంచాలకు మించి వాడకూడదు. సలాడ్స్, నాటుకోడి, చేప తినొచ్చు. వీటితో పాటు ఒత్తిడినీ నియంత్రించుకోగలిగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
News January 10, 2026
మెడ నలుపు తగ్గాలంటే?

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.


