News March 29, 2025
ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రులు

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 10 రోజుల పాటు ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించనున్నారు. ఉగాది సందర్భంగా రేపు ఉ.9 గంటలకు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారని ఆలయ అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని తెలిపారు. రేపు పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News April 1, 2025
‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డ్

హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన IND చిత్రాల్లో బుక్మై షో పబ్లిక్ రేటింగ్ 9.5 సాధించిన మూవీగా నిలిచింది. రూ.10 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అలాగే USలో మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియదర్శిని, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు.
News April 1, 2025
అసదుద్దీన్తో సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు

TG: హైదరాబాద్లో మైనారిటీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఆయనతోపాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా విందులో పాల్గొన్నారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం’ అని సీఎం పేర్కొన్నారు.
News April 1, 2025
నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు