News October 15, 2024
మద్యం దుకాణాల్లో SPY రెడ్డి కుమార్తె హవా

AP: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజల 10కిపైగా మద్యం దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురంలో 4, కర్నూలులో 1, పీలేరు నియోజకవర్గంలో కూడా ఆమె పలు షాపులు కైవసం చేసుకున్నారు. కాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు సిండికేట్గా ఏర్పడి 246 దరఖాస్తులు వేయగా ఒక్కటంటే ఒక్క దుకాణం కూడా దక్కలేదు. దీంతో వారు లబోదిబోమంటున్నారు.
Similar News
News November 12, 2025
ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు రద్దు

కార్తీకమాసం ముగింపు నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ టిక్కెట్ల విక్రయం నిలిపివేయబడుతుందని తెలిపారు.
News November 12, 2025
ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 12, 2025
బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.


