News January 8, 2026

SRCL:బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆయా శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని రాజన్న సిరిసిల్లజిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ – 2026 సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Similar News

News January 29, 2026

ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలంటే..?

image

నిజానికి ఏకాదశి ఉపవాసం దశమి రోజే మొదలవుతుంది. ఆరోజు మాంసాహారం తినకూడదు. సాయంత్రం వేళ తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించాలి. రోజంతా వీలైనంత వరకు ఏమీ తినకుండా ఉండటం శ్రేష్టం. శక్తిలేని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. నిరాహారంగా ఉండలేకపోయినా ‘మౌన వ్రతం’ పాటించడం మంచిది. మరుసటి రోజున(ద్వాదశి) ఉదయం తులసి తీర్థం సేవించి ఉపవాసం విరమించాలి.

News January 29, 2026

సంగారెడ్డి: 18+ ఓటు ఆకృతిలో విద్యార్థులు

image

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మల్కాపూర్‌లోని ఓ పాఠశాల గ్రౌండ్‌లో 18+ ఓటు ఆకృతిలో విద్యార్థులతో బుధవారం నిర్వహించారు. జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో రాజ్యాంగ నిబంధనలు పార్లమెంట్ శాసనాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తారని, అందుకుగాను స్వచ్ఛంద ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం పనిచేస్తుందన్నారు.

News January 29, 2026

సంగారెడ్డి: FIRST DAY 99

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డు స్థానాలకు తొలి రోజు 99 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్- 46, బీఆర్ఎస్-28, బీజేపీ- 18, బీఎస్పీ-1, ఇండిపెండెంట్లు-6 నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 30వ తేదీ వరకు ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశారు.