News January 27, 2025

SRCL: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని SRCLకలెక్టర్ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలన్నారు.

Similar News

News October 24, 2025

మైనారిటీ వృత్తి శిక్షణకు సంస్థల దరఖాస్తుల ఆహ్వానం

image

మైనారిటీలకు ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తి నైపుణ్య శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. ముజాహిద్ తెలిపారు. గవర్నమెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థలతో అనుసంధానమైన ట్రైనింగ్ పార్ట్‌నర్ సంస్థలు నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలు, ఆడిట్ రిపోర్టులు జతపరచాలన్నారు.

News October 24, 2025

గెలుపు దిశగా భారత్

image

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ కీలక మ్యాచులో భారత అమ్మాయిలు ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నారు. 341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను 154 రన్స్‌కే 5 వికెట్లు తీసి దెబ్బకొట్టారు. రేణుకా ఠాకూర్ 2 వికెట్లు తీయగా క్రాంతి, స్నేహ, ప్రతీకా రావల్ తలో వికెట్ పడగొట్టారు. భారత్ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఈ మ్యాచులో గెలిస్తే సెమీస్‌కు లైన్ క్లియర్ కానుంది.

News October 24, 2025

భూపాలపల్లి: 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆరూరి శ్యామల తెలిపారు. ఓ ఫైనాన్స్ క్రెడిట్ ప్రవేట్ కంపెనీ లిమిటెడ్ నందు బ్రాంచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు జాబ్ మేళా నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకువాలన్నారు.