News January 27, 2025
SRCL: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని SRCLకలెక్టర్ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆయా శఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News December 26, 2025
హనుమకొండ: భార్య గొంతు కోసిన భర్త

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పరకాల మండలం మలకపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేస్తున్న మంద అనూష(35)ను ఆమె భర్త రవి కత్తితో గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది. అనూషను స్థానికులు హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
NRPT: అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బదిలీ

నారాయణపేట అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా విధులు నిర్వహించిన సంచిత్ గంగ్వార్‌ను GHMC మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న నారాయణ్ అమిత్ మాలెంపాటిని నారాయణపేటకు బదిలీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ సెలవులో ఉండటంతో సంచిత్ గంగ్వార్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించారు.
News December 26, 2025
ఏపీ న్యూస్ అప్‌డేట్స్

*మత్స్యకారులకు 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు అందిస్తామన్న మంత్రి DSBV స్వామి.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సబ్సిడీ వలలు పంపిణీ
*దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించారని ట్వీట్
*వరుస సెలవులతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ప్రయాణాలు.. విజయవాడ మార్గంలో ట్రాఫిక్ జామ్


