News September 16, 2025
SRCL: ‘ఓటర్ జాబితా స్పెషల్ రివిజన్ కట్టుదిట్టంగా చేపట్టాలి’

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. 2022 సం. ఓటర్ల జాబితాతో తాజా జాబితాను పోల్చి, డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ధృవీకరణ చేసి, సెప్టెంబర్ 22లోపు జాబితా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
జైపూర్: విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. జైపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. అధికారులు తదితరులు ఉన్నారు.
News September 17, 2025
ఉద్యమాల పురిటి గడ్డ.. మెదక్ జిల్లా

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో మెదక్ నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మెదక్ నుంచి మగ్దూం మోయినోద్దీన్, కేవల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
సిద్దిపేట: ‘నెత్తురు చిందించిన నేల బైరాన్‌పల్లి’

రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి నిజాంల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వడిశెల రాళ్లతో రజాకార్లకు జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు బైరాన్ పల్లి. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లిలో రజాకార్లు జరిపిన దాడిలో 119 మంది యోధులు నేలకొరిగారు. ఈ మారణకాండ అమృత్ సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది.