News January 11, 2026

SRCL: కలెక్టరేట్‌లో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి

image

వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించగా, ముందుగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వడ్డే ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న సేవలను కొనియాడారు.

Similar News

News February 20, 2026

NTR: వీరికి కావాలి ఉపశమనం..!

image

విజయవాడ కమిషనరేట్ పరిధిలో VIPల రాకతోపాటు రెండ్రోజులకు ఓ ఈవెంట్ నిర్వహించడంతో పోలీసులపై పని భారం పెరిగింది. గతేడాది దసరా ఉత్సవాలు మొదలు.. నెలకు ఒకటి రెండు ఈవెంట్స్‌తోపాటు రాష్ట్ర కార్యక్రమాలు, డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, బందోబస్తులతో కింది స్థాయి సిబ్బంది నుంచి.. SHOల వరకు భారం ఉంటోంది. ట్రాఫిక్ పోలీసులు ఐతే అన్ని రకాల డ్యూటీలు చేస్తున్నారు. దీంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

News February 20, 2026

వనపర్తి: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు శుభవార్త

image

వివిధ దశల్లో నిర్మాణాలు ఉండి ఇందిరమ్మ బిల్లులు మంజూరి నిలిచిపోయిన ప్రతి ఒక్కరికి బేస్ మెట్ లెవెల్ ఖర్చు మినహాయించి ఆ పైన ఉన్న నిర్మాణాలకు సంబంధించి బిల్లులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం GO RT NO 96 జారీ చేసింది. దీంతో పలు దశలో ఉన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలన్నింటినీ ఆయా దశలను బట్టి బిల్లులు మంజూరు అవుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

News February 20, 2026

పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

image

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.