News March 2, 2026

SRCL: జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీపాదరావుకు ఘన నివాళి

image

సిరిసిల్లలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీపాదరావు సేవలను ఆయన కొనియాడారు. జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Similar News

News March 2, 2026

తిరుపతిలో నగల కోసం వృద్ధురాలి దారుణ‌ హత్య

image

నగల కోసం వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవపల్లె వీధిలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగిని కె. లక్ష్మమ్మ (67) నివాసం ఉంటోంది. ఆమెను దుండగులు గొంతు నులిమి, దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 100 గ్రాములకు పైగా బంగారు నగలను కాజేశారని అన్నారు. ఈ ఘటనపై క్లూస్ టీం, వెస్ట్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

News March 2, 2026

భారతీయులు అప్రమత్తంగా ఉండాలి: MP మిథున్‌రెడ్డి

image

పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు రాజంపేట MP మిధున్‌రెడ్డి సూచన చేశారు. అక్కడి దేశాల్లో పరిస్థితులు ఏవైనా మారుతున్నా.. దయచేసి అప్రమత్తంగా ఉండి అక్కడి ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయం జారీచేసే సూచనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.

News March 2, 2026

WGL: NPDCL పరిధిలో గరిష్ఠ విద్యుత్ రికార్డు

image

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో సోమవారం 6273 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదై సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వినియోగం పెరిగిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర సరఫరా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వేసవిని ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.