News October 23, 2025

SRCL: జీతాలు మాయం చేసిన సెక్రటరీ అరెస్ట్

image

మల్టీపర్పస్ వర్కర్ల జీతాలను మాయం చేసిన మాజీ పంచాయతీ సెక్రెటరీ సయ్యద్ ముక్తార్ అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇల్లంతకుంట SI అశోక్ తెలిపారు. ప్రస్తుతం వీర్నపల్లి మండలానికి బదిలీ అయిన ముక్తార్ ఐదుగురు మల్టీపర్పస్ కార్మికుల రూ.1,42,000లను చెక్కుల ద్వారా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని వివరించారు. ఓగులాపూర్ గ్రామపంచాయతీలో 2025 జనవరి నుంచి మే నెల వరకు అతడు విధులు నిర్వర్తించాడు.

Similar News

News October 23, 2025

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి: కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీపై దృష్టి సారించి ప్రత్యేక పఠన ప్రణాళికలు అమలు చేయాలన్నారు. సమయ పాలనతో పరీక్షలు నిర్వహించమని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

News October 23, 2025

MBNR: నేర సమీక్ష.. కేసుల దర్యాప్తుపై ఎస్పీ దృష్టి

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిపై ఆరా తీశారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 23, 2025

తేలని ‘స్థానిక’ అంశం!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.