News November 18, 2025
SRCL: ‘డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతిఒక్కరు కృషి చేయాలి’

జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ వ్యాప్తి చేస్తున్న సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ మహేష్ బి గితే పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లా కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. వైద్య కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఏం కావాలో తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తానని బండి హామీ ఇచ్చారు.
Similar News
News November 18, 2025
అల్లూరి: ‘భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’

రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, ఆర్వోఎఫ్ఆర్, మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ నందు ఆధార్ నంబర్లను సరిచేసి వెంటనే అనుమతి కోసం మండల వ్యవసాయ అధికారుల లాగిన్‌కు పంపించాలన్నారు.
News November 18, 2025
విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను పరిశీలించిన కమిషనర్, మేయర్

వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంగళవారం బాలసముద్రంలోని విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను సందర్శించారు. హాస్టళ్లు, హోటళ్లు, మార్కెట్ల నుంచి సేకరించిన ఆహార వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి జరుగుతున్న ట్రయల్ రన్‌ను వారు సమగ్రంగా పరిశీలించారు. పనులు మరింత వేగవంతంగా జరిగేలా సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
News November 18, 2025
చలికి చర్మం పగులుతుందా?

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్‌గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.


