News October 8, 2025

SRCL: దినసరి కూలీ అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పదంగా ఓ దినసరి కూలీ మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కూడెల్లి పరశురాములు(35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే ఓ ఇంటి నిర్మాణపనికి వెళ్లాడు. అకస్మాత్తుగా కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

Similar News

News October 8, 2025

వంగర: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

వంగర మండలం మగ్గూరుకి చెందిన కళ్లే పిల్లి జగదీష్ (33) మంగళవారం రుషింగి వంతెన పైనుంచి దూకిన విషయం తెలిసిందే. కిమ్మి, రుషింగి గ్రామాలకు చెందిన వారు గాలించినప్పటికీ జగదీష్ జాడ కనిపించలేదు. భార్య ఫిర్యాదుతో వంగర పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం NDRF, పోలీసు బృందాల గాలింపు చేపట్టగా వీరఘట్టం మండలం మెట్ట వెంకటపురం వద్ద మృతదేహం లభ్యమైంది.

News October 8, 2025

సిద్దిపేట: ‘అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దు’

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. కావున పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టవద్దని, తప్పనిసరి అయితే పోలీస్ అనుమతి తీసుకోవాలని సూచించారు.

News October 8, 2025

జియో భారత్ కొత్త ఫోన్.. ఫీచర్లేమిటంటే

image

జియో భారత్ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. పెద్దలు, పిల్లల వినియోగానికి అనుగుణమైన సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. లొకేషన్ మానిటరింగ్, యూసేజ్ మేనేజింగ్ వ్యవస్థతోపాటు బ్యాటరీ బ్యాకప్ 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాల్స్, మెసేజ్‌ల నియంత్రణ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రారంభ ధర ₹799గా నిర్ణయించింది. ఇప్పటికే తెచ్చిన జియో పీసీలలో AI క్లాస్ రూమ్ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామని తెలిపింది.