News October 31, 2025
SRCL: దేవుడా.. ఈ తల్లికొచ్చిన కష్టం పగోడికీ రావద్దు..!

చెట్టంత కొడుకు కళ్లముందే ఆత్మహత్యకు పాల్పడ్డా.. కిరాయి ఇంట్లోకి బిడ్డ శవాన్ని తీసుకెళ్లే పరిస్థితుల్లేకున్నా ఆ తల్లి(శారద) కలతచెందలేదు. మనోధైర్యంతో మార్చురీగది నుంచే కుమారుడి అంతిమయాత్ర తీసింది. భర్త లేకపోవడంతో తానే కొడుకు చితికి నిప్పుపెట్టింది. ఈ హృదయవిదారక సంఘటన సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో జరిగింది. కాగా, మృతుడు గౌడ విశాల్(25) అనారోగ్య సమస్యలతో సోమవారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News October 31, 2025
రోహిత్‌కు కెప్టెన్సీ ఇచ్చేయండి: ఫ్యాన్స్

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తమతో కొనసాగుతారని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ మొదలుపెట్టారు. ముంబైలో కొనసాగేందుకు తిరిగి జట్టు పగ్గాలు హిట్ మ్యాన్‌కు అప్పగించాలని SMలో డిమాండ్ చేస్తున్నారు. ‘కేవలం రోహిత్ సారథ్యంలోనే ముంబై కప్పు కొట్టగలదు. కెప్టెన్సీతో అతనికి తగిన గౌరవం ఇవ్వాలి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
News October 31, 2025
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: VZM DMHO

PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నాయని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 31, 2025
ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


