News November 3, 2025
SRCL: పెద్దింటి అశోక్ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.
Similar News
News November 3, 2025
నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్‌ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.
News November 3, 2025
HYD: మృతులకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: సీపీఐ

చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతిచెందడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి వైద్య ఖర్చులు భరించాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News November 3, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 25 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, DRO సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈ రోజు ఉదయం RR జిల్లా చేవెళ్ల మండలం, మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రజావాణికి 25 ఫిర్యాదులు రాగా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు.


