News September 9, 2025

SRCL: ప్రజావాణికి 154 దరఖాస్తులు

image

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇవాళ జరిగిన ప్రజావాణిలో 154 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 49, అత్యల్పంగా SC కార్పొరేషన్, ADSLR, జిల్లా వ్యవసాయ శాఖ, ఏడీ మైన్స్, వేములవాడ మున్సిపల్, DEO, ఇరిగేషన్, EEPR, DIEO, LDM, మార్కెటింగ్ శాఖకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

Similar News

News September 10, 2025

MHBD: క్యాన్సర్ కేర్ యూనిట్ ప్రారంభం

image

MHBD జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ కేర్ యూనిట్ సేవలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్య శాఖ మంత్రి రాజ నర్సింహ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. MNJ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో జిల్లాలోని 160 మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ సేవలు అందించనున్నారు.

News September 10, 2025

JGTL: క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన SP

image

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మంగళవారం జిల్లా కేంద్రానికి చెందిన పలువురు క్రికెట్ క్రీడాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహించే జగిత్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోస్టర్‌ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జగిత్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

News September 10, 2025

ఈ కారు ధర రూ.30 లక్షలు తగ్గింది

image

జీఎస్టీ కొత్త శ్లాబుల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మోడళ్లను బట్టి ఈ కారు ప్రైజ్ రూ.4.5లక్షల నుంచి రూ.30.4లక్షలు తగ్గడం విశేషం. అయితే రేంజ్ రోవర్ బేసిక్ మోడల్ రేటు రూ.2 కోట్లకు పైమాటే. ఇక ఇదే కంపెనీకి చెందిన డిఫెండర్‌పై రూ.7-రూ.18.60 లక్షలు, డిస్కవరీపై రూ.4.5-రూ.9.90 లక్షల మేర తగ్గింపు వర్తించనుంది.