News October 20, 2025

SRCL: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..!

image

వరుస లొంగుబాట్లపై నిషేధిత CPI, మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని బహిరంగంగా ఆరోపించింది.

Similar News

News October 20, 2025

హనుమకొండ: 11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

image

హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాడుతున్న 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.1.23 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

News October 20, 2025

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 2/2

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

News October 20, 2025

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

image

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట (M) కురుమూర్తిలో ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచనగుహగా పేరొందిన కురుమూర్తి కొండలలోని వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ.1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. Way2News ప్రత్యేక కథనం.